మీనాన్నతో చెప్పి ఉక్రెయిన్ యుద్ధం ఆపొచ్చుగా..జర్నలిస్టు ప్రశ్నకు 22 ఏళ్ల యువతి సంచలన రిప్లై..ఎవరీమే!

మీనాన్నతో చెప్పి ఉక్రెయిన్ యుద్ధం ఆపొచ్చుగా..జర్నలిస్టు ప్రశ్నకు 22 ఏళ్ల యువతి సంచలన రిప్లై..ఎవరీమే!

22ఏళ్ల అకా లూయిజీ రోజోవా..ఫేస్ కు మాస్క్ ధరించి ఓ జర్నలిస్టుకు ఇచ్చింది.. మూడు వారాల క్రితం మీ నాన్న మా సోదరుడిని చంపేశాడు.. మీకు ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతిస్తున్నారా..?మీ తండ్రికి ఫోన్ చేసి నాన్నా.. కైవ్ పై షెల్లింగ్ ఆపండి అని చెప్పొచ్చుగా అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఉక్రెయిన్ యుద్ధానికి క్షమాపణ చెబుతున్నా అని  చెప్పింది. ఇంతకీ ఎవరీ అకా లూయిజా రోజోవా.. ఆమెకుఉక్రెయిన్ యుద్ధానికి సంబంధం ఏమిటీ..ఆమె ఎందుకు క్షమాపణ చెప్పింది.. ఎవరు ఆమె తండ్రి?

ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రహస్యకుమార్తెగా చెప్పుకోబడుతున్న అకా లూయిజా రోజోవా ఇంటర్వ్యూ హాట్ టాపిక్ అయింది. పారిస్‌లో ఉక్రేనియన్ జర్నలిస్ట్ డిమిట్రో స్వియాట్నెంకోతో ముఖాముఖిలో మాట్లాడిన రోజోవా.. తన తండ్రి  పుతిన్ యుద్ధానికి క్షమాపణలు చెప్పింది.  

►ALSO READ | ఎన్నాళ్లో వేచిన ఉదయం ! ఎట్టకేలకు శాంతి బహుమతి అందుకున్న ట్రంప్.. ఫిఫా నిర్ణయంపై వెల్లువెత్తిన విమర్శలు

ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో మా ఉక్రెయిన్ సోదరుడు చనిపోయాడు..యుద్ధానికి మీరు మద్దతు ఇస్తున్నారా.. అని అడిగింది. స్పందించిన రోజోవా.. దానికి నాకు సంబంధం ఏమిటని అంటూనే నన్ను క్షమించండి అని అనేకమార్లు ఒకే సమాధానం చెప్పింది. ఫ్రెంచ్ రాజధాని రోజోవా వీధుల్లో చిత్రీకరించబడిన ఆమె, ముసుగు ధరించి, అంగరక్షకుడితో కలిసి వెళ్తున్న రోజోవాను ‘‘కనీసం మీ తండ్రికి ఫోన్ చేసి .. నాన్న కైవ్ పై షెల్లింగ్ ఆపండి అని చెప్పొచ్చుగా అన్న ప్రశ్నకు నిజంగా సమాధానంగా ‘‘నన్ను క్షమించండి.. యుద్ధం ఆపేంత శక్తి నాకు లేదు’’ వడివడిగా నడుచుకుంటూ వెళ్లింది. 

మూడేళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్ కు కోలుకోలేని దెబ్బతగిలింది.. వేలాది మంది సైనికులు, ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. తాజాగా కూడా రష్యా సైనికులు ఉక్రెయిన్ పై బాంబు షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఉక్రెయిన్ పై జరిగిన దాడుల సందర్భంగా పారిస్ లోని ఉక్రేనియన జర్నలిస్ట్ పుతిన్ రహస్య కూతురుగా చెప్పబడుతున్న రోజోవాను ఇంటర్వ్యూ చేయడం.. ఆ న్యూస్ బయటికి రావడం చర్చనీయాంశమైంది.