తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి

చెన్నై: తమిళనాడులోని రామనాథపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొని ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులందరూ ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులుగా పోలీసులు గుర్తించారు.

రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి గురైన కార్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు చెందినదని వెల్లడైంది. అందులో అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్నారు. మరో కారు ఐరావడి వైపు వెళుతోంది. ఈ ప్రమాదం కీఝక్కరై సమీపంలో జరిగింది. రెండు కార్లలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.