బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 గ్రాండ్ ఫినాలే దగ్గర పడింది. మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ప్రారంభంలో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా.. ఇప్పుడు మాత్రం రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ మధ్య వాదనలు, బాండింగ్, విభిన్నమైన టాస్క్ లతో ఆకట్టుకుంటోంది. రేటింగ్ కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా, సామాన్యుడు కళ్యాణ్ పడాల , స్ట్రాటజీ ప్లేయర్ తనూజల మధ్య టైటిల్ రేసులో ఎవరు గెలుస్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇమ్మాన్యుయేల్ కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో ఫినాలేకు ముందు హౌస్‌లో వాతావరణం రసవత్తరంగా మారింది.
బిగ్‌బాస్ షో టైం మార్పు.. !
అయితే, షో మాంచి ఊపులో ఉన్న ఈ కీలక సమయంలో, బిగ్‌బాస్ అభిమానులకు స్టార్ మా ఛానల్ చిన్న ఝలక్ ఇచ్చింది. తన ప్రైమ్ టైమ్ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ, బిగ్‌బాస్ ప్రసార సమయాన్ని అరగంట మేర వాయిదా వేసింది. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9 సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకి ప్రసారమవుతోంది. వీకెండ్ శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే టెలికాస్ట్ అవుతుంది. అయితే డిసెంబర్ 8 నుంచి ఈ ప్రసార సమయాల్లో మార్పు రాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఇకపై బిగ్‌బాస్ షో రాత్రి 10 గంటలకి స్టార్ మాలో ప్రసారం అవుతుంది. వీకెండ్ శని, ఆదివారాలు మాత్రం ఎప్పటిలాగే రాత్రి 9 గంటలకే ప్రసారం అవుతుంది.
కొత్త సీరియల్ కోసమే ఈ మార్పు!
ఈ అరగంట వాయిదాకు కారణం స్టార్ మాలో రాబోతున్న కొత్త సీరియల్. డిసెంబర్ 8వ తేదీ నుంచి ‘పొదరిల్లు’ అనే సరికొత్త సీరియల్ ప్రారంభం కానుంది. ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకి ప్రసారం కానుంది. రేటింగ్ పరంగా బిగ్ బాస్‌కు పోటీగా నిలవడానికి ఈ కొత్త సీరియల్‌ను ఛానల్ కీలకమైన స్లాట్‌లో ప్రవేశపెడుతోంది. బిగ్‌బాస్ ఫినాలేకు దగ్గరవుతున్న తరుణంలో, ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే హై-డ్రామా, టాస్క్‌ల ఎపిసోడ్స్ ఆలస్యంగా ప్రసారం కావడంపై అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. అయినా, బిగ్ బాస్ రేటింగ్‌పై ఈ టైమ్ మార్పు ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.
మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న #Podarillu, కేవలం 3 రోజుల్లో మీ ముందుకు రాబోతుంది! 👀🪷
— Starmaa (@StarMaa) December 5, 2025
Watch #Podarillu Starting From 8th Dec, Mon - Fri at 9:30 PM only on #StarMaa pic.twitter.com/GCpYSX288C
