న్యూఢిల్లీ: రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం (డిసెంబర్ 5) రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇరుదేశాల రాయబారులను ఆహ్వానించారు. కానీ లోక్ సభ, రాజ్య సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించలేదు.
ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు పుతిన్ విందుకు ఇన్విటేషన్ అందింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కాదని శశిథరూర్‌ను డిన్నర్‌కు ఇన్వైట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పుతిన్ పర్యటనకు ముందే మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. విదేశీ ప్రముఖులు ప్రతిపక్ష నేతలను కలిసే సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కతుందని విమర్శించారు. మోడీ సర్కార్ అభద్రతా భావంతో విదేశీ ప్రముఖులను ప్రతిపక్ష నేతలతో కలవనివ్వడం లేదని ఆరోపించారు.
►ALSO READ | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి: జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాకు మంత్రి ఉత్తమ్ ఆహ్వానం
ఇండియా అంటే ప్రభుత్వమే కాదని.. ప్రతిపక్షం కూడా దేశంలో భాగమేనని రాహుల్ గాంధీ చురకలంటించారు. రాహుల్ గాంధీ విమర్శించినప్పటికీ రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు ఇచ్చిన విందుకు మాత్రం లోక్ సభ, రాజ్య సభ ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. అయితే.. రాహుల్ విమర్శలను తిప్పికొట్టే వ్యూహంలో భాగంగా మోడీ సర్కార్ తెలివిగా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను డిన్నర్‌కు ఇన్వైట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
