హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ.. సీఎం చేతుల మీదుగా.. అభ్యర్థులకు గ్రూప్ 2 నియామక పత్రాలు

హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ.. సీఎం చేతుల మీదుగా.. అభ్యర్థులకు గ్రూప్ 2 నియామక పత్రాలు

హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం కొలువుల పండుగ కార్యక్రమం నిర్వహించింది. శనివారం (అక్టోబర్ 18) నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర నాయకులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు జాబ్ లెటర్స్ అందజేశారు సీఎం. 

 సీఎం రేవంత్ స్పీచ్ ముఖ్యాంశాలు:

  • తెలంగాణ పునర్ణిర్మాణంలో 783 మంది భాగస్వాములు కాబోతున్నారు
  • దీపావళి సందర్భంగా మీ తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాం
  • ఉద్యోగం అంటే భావోద్వేగం..
  • ఉద్యోగులు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి
  • లేదంటే వారి జీతంలో నుంచి 15 శాతం తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాం
  • అందుకోసం కొత్త చట్టం తెస్తాం
  • అనేక మంది  బలినాదాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
  • తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారు
  • ఏ రోజు కూడా రాష్ట్ర యువత గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు
  • ఆ కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారు.
  • కేసీఆర్ తన కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలలను నింపుకున్నారు. 
  • గత 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 నియామకాలు జరపలేదు
  • నిరుద్యోగుల గురించి ఏ నాడు ఆలోచించలేదు
  • గ్రూప్1, గ్రూప్ 2 నియామకాల విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి
  • అయినప్పటికీ సమర్ధవంతంగా పూర్తిచేశాం.
  •  త్వరలోనే గ్రూప్ 3, 4 నియామకాలు జరిపి ఉద్యోగాలు ఇస్తాం
  • గతంలో TSPSC లో ఉన్నవాళ్లు, ఇప్పుడు ఉన్న వాళ్లు ఎవరో గుర్తించండి
  • కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయింది
  • దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు
  • వరి పంట వేస్తే ఉరి అన్నారు
  • ఫామ్ హౌస్ లో పడుకుని ఎకరాకు కోటి పండిస్తున్నట్లు చెప్పారు
  • ఆ కళను ప్రజలకు ఎందుకు చెప్పలేదు
  • దేశంలో ఎక్కడా జరగని విధంగా కుల సర్వే చేశాం
  • మా ఒత్తిడితోనే కేంద్రం దిగొచ్చింది.. జనగణనలో కులగణన చేసేలా ఒత్తిడి తెచ్చాం
  • మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు 
  • చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని.. 
  •  గ్రూప్ 1  విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. 
  • ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం 
  • గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి.. 
  • అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు 
  • అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు 
  • ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ 
  • మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి..
  •  రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలి 
  • దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి 
  • రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు 
  • నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి
  • గత పాలకుల పాపాల పుట్ట కదులుతోంది
  • వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు 
  • హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు 
  • సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. 
  • అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలి 
  • ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి 
  • సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలి