
టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న. తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. నేషనల్ క్రష్ గా దేశ వ్యాప్తంగా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 'పుష్ప: ది రూల్' నుంచి 'యానిమల్' వరకు వరుస హిట్‌లతో.. ఈ బ్యూటీ బాక్సాఫీస్ స్టార్ అని నిరూపించుకుంది.
►ALSO READ | Bigg Boss Telugu 9: కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందా? రమ్య ఆరోపణలపై నాగ్ వార్నింగ్!
నిశ్చితార్థం చుట్టూ పుకార్లు
అయితే ఇటీవల రష్మిక తన సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించే వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం జరిగిందంటూ వస్తున్న వార్తలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేలా.. వీరిద్దరూ ఒకే రకమైన ఉంగరాలను ధరించడాన్ని అభిమానులు గుర్తించారు. రష్మిక ధరించింది పెద్ద వజ్రపు ఉంగరం ,, విజయ్ ధరించింది సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉన్న బ్యాండ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సిగ్గుతో చెప్పేసిన రష్మిక..
లేటెస్ట్ గా, రష్మిక తన కొత్త చిత్రం 'థమా' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించిన తీరు ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంటర్వ్యూయర్ ఆమెను అభినందించినప్పుడు, రష్మిక కాసేపు కన్ఫ్యూజ్ అయ్యింది. ఆ తర్వాత, జర్నలిస్ట్ సరదాగా ఇంకేమైనా శుభవార్త ఉందా? అని ప్రశ్నించారు. దానికి రష్మిక సిగ్గుపడుతూ, చిరునవ్వుతో లేదు లేదు అంటూనే బదులిచ్చింది. నిజానికి చాలా విషయాలు జరుగుతున్నాయి. కానీ, వాటన్నింటికీ మీ శుభాకాంక్షలు తీసుకుంటాను. ఆమె నవ్వుతూ సిగ్గుతో సమాధానం చెప్పడంతో వారిద్దరి నిశ్చితార్థం జరిగిందనే వార్తలకు మరింత బలం చేకూరింది.
ఆన్-ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ..
రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి 'గీత గోవిందం' , 'డియర్ కామ్రేడ్' వంటి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించారు. తెరపై వీరిద్దరి తిరుగులేని కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్లలో కూడా ఈ జంట పట్ల అభిమానులు ప్రేమ పెంచుకునేలా చేసింది. వారు తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ జంటకు దగ్గరగా ఉండే అంతర్గత వ్యక్తుల సమాచారం ప్రకారం, వీరు 2026 ప్రారంభంలో వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది, అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు, రష్మిక తన తదుపరి చిత్రం'థమా' దీపావళి కానుకగా అక్టోబర్ 21, 2025న థియేటర్లలోకి రానుంది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ మూవీని దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కించారు. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగమైన ఈ చిత్రంలో, సాధారణ వ్యక్తి నుంచి పిశాచంగా మారే అలోక్ గోయల్‌గా ఆయుష్మాన్ ఖురానా నటించగా, పిశాచి అయిన తాడక పాత్రలో రష్మిక అతని ప్రేయసిగా కనిపించనుంది. విలన్ యక్షాసన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీ, అలోక్ తండ్రి రామ్ బజాజ్ గోయల్‌గా పరేష్ రావల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి..
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/h1iN8Uflvxk?si=6KenSrzZ-hqxLPaO" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>