DUDE Box Office: దుమ్మురేపావ్ ప్రదీప్ ‘డ్యూడ్’.. దెబ్బకు ఆ 2 సినిమాల రికార్డ్ అవుట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

DUDE Box Office: దుమ్మురేపావ్ ప్రదీప్ ‘డ్యూడ్’.. దెబ్బకు ఆ 2 సినిమాల రికార్డ్ అవుట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

లవ్ టుడే’ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మరో హిట్ కొట్టేశాడు. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో నటించిన లేటెస్ట్ ‘డ్యూడ్’ మూవీ.. ఫస్ట్ డే వసూళ్లతో దుమ్మురేపుతోంది. మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కాలేజీ లైఫ్, లవ్, ఎమోషన్స్ని బేస్ చేసుకుని రాసిన సీన్స్, డైలాగ్స్ యూత్ని కట్టి పడేస్తున్నాయి. తమిళ్తో పాటూ తెలుగు ఆడియన్స్లో కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ క్రమంలో డ్యూడ్ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.

డ్యూడ్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్:

డ్యూడ్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో అదరగొట్టింది. శుక్రవారం (అక్టోబర్ 17న) విడుదలైన డ్యూడ్ సినిమాకు.. ఫస్ట్ డే ఇండియాలో రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో రూ.3.25 కోట్లు వసూళ్లు చేయగా.. తమిళంలో అత్యధికంగా రూ.6.75 కోట్లు సాధించి శభాష్ అనిపించుకుందని తెలిపింది. అయితే, గ్రాస్ ఎంతనేది ఇవాళ మైత్రి మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓవర్సీస్, అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ యాడ్ చేస్తే రూ.15 నుంచి 20 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు లెక్క కడుతున్నారు.

ఈ క్రమంలో డ్యూడ్ తొలిరోజు బాక్సాఫీస్ రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్.. ప్రదీప్ గత సినిమాల రికార్డులని అధిగమించింది. తన లవ్ టుడ్ సినిమాకు తొలిరోజు రూ.2.45 కోట్ల ఓపెనింగ్ రాగా.. రెండో బ్లాక్ బస్టర్ డ్రాగన్‌ రూ.6.5 కోట్ల నెట్ కలెక్షన్లను బీట్ చేసేసింది. ప్రదీప్ తన మార్క్తో హ్యాట్రిక్ హిట్ కొట్టిసినట్లే అని సినీ క్రిటిక్స్ వెల్లడించారు.

ప్రదీప్.. తన శైలి కామెడీ టైమింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్తో పాటుగా బలమైన ఎమోషన్స్ తోనూ ప్రదీప్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. ప్రదీప్ రంగనాథన్ నటించిన విధానం ఆడియన్స్కు ఫిదా అవుతున్నారు. ప్రదీప్-మమితా బైజుల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కులాంతర వివాహాలు, పరువు హత్యల నేపథ్యంలో ఇచ్చిన సందేశం యువతని ఆలోచింపజేస్తుంది. 

డ్రాగన్:

ఇకపోతే.. ప్రదీప్ రంగనాథన్ నటించిన లాస్ట్ మూవీ డ్రాగన్ (Dragon). తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్గా వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అయింది. 2025 ఫిబ్రవరి 21న థియేటర్స్కి వచ్చిన డ్రాగన్.. వరల్డ్ వైడ్గా రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి.. స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ మూవీ తెలుగు ఆడియన్స్ని వీపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రదీప్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. డ్యూడ్తో వచ్చి మరో హిట్ని సొంతం చేసుకోనున్నాడు.