అభ్యంగన స్నానం అంటే ఏంటి.. ఎలా చేయాలి..? కావలసిన పదార్థాలేంటి...?

అభ్యంగన స్నానం అంటే ఏంటి.. ఎలా చేయాలి..? కావలసిన పదార్థాలేంటి...?

అభ్యంగన స్నానం అనేది దీపావళి రోజున నిర్వహించే పవిత్ర శుద్ధి కర్మ. ఇది శరీరం, ఆత్మ రెండిటినీ శుభ్రపరుస్తుందని నమ్ముతారు. అయితే.. అభ్యంగన స్నానం చేయడానికి సరైన సమయం ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. ద్రిక్ పంచాంగ్ ప్రకారం, అభ్యంగన స్నానానికి ముహూర్తం చంద్రోదయం, సూర్యోదయం మధ్య ఉంటుంది, అయితే చతుర్దశి తిథి అమలులో ఉంటుంది. 

ఈ ఆచారంలో మూలికా పేస్ట్ ఒంటికి రాసుకొని, ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత అభ్యంగ స్నానం చేస్తారు.ఈ సంవత్సరం, స్నానాన్ని నరక చతుర్దశి - సోమవారం, అక్టోబర్ 20, 2025 నాడు నిర్వహించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అభ్యంగన స్నాన ముహూర్తం ఉదయం 05:13 నుండి ఉదయం 06:25 వరకు ఉంటుంది.

కావలసినవి:

  • కపూర్ కచ్రీ (ఎండిన రైజోమ్): 25 గ్రాములు
  • నాగర్మోత పొడి: 25 గ్రాములు
  • వెటివర్ (వేర్ల పొడి) : 25 గ్రాములు
  • పసుపు (హల్ది): 25 గ్రాములు
  • గంధం (చందన) పొడి: 25 గ్రాములు
  • కర్పూరం పొడి: 25 గ్రాములు
  • మంజిష్ఠ వేరు పొడి: 25 గ్రాములు
  • గులాబీ రేకులు / గులాబీ పొడి: 25 గ్రాములు
  • నారింజ తొక్క పొడి: 25 గ్రాములు
  • ముల్తానీ మట్టి (ఫుల్లర్స్ ఎర్త్): 25 గ్రాములు

ఎలా చేయాలి:

  • అన్ని పొడులను బాగా కలపండి
  • ఈ పేస్ట్ సిద్ధం చేయడానికి గోరువెచ్చని నీరు లేదా గోరువెచ్చని పాలు లేదా కొబ్బరి పాలు వాడాలి.
  • ముందుగా శరీరంపై వెచ్చని నువ్వుల (టిల్) నూనెను పూయండి, ఆపై ఉబ్టాన్ పేస్ట్‌ను నూనె రాసిన చర్మంపై పొరలుగా వేయండి.
  • పేస్ట్‌ను 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి.
  • తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి, ఉబ్తాన్ ను సున్నితంగా స్క్రబ్ చేయండి.
  • ఉబ్తాన్ ఆచారంలో మసాజ్ కోసం నువ్వుల నూనెను ఉపయోగించమని నిపుణులు సూచిస్తున్నారు.

►ALSO READ | చలికాలంలో విటమిన్ D ఎలా పెంచుకోవాలి : ఏ ఫుడ్ తింటే బెటర్..!