
బిగ్‌బాస్ తెలుగు 9 హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు అగ్గి రాజేశాయి. ప్రస్తుతం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్లు ఉంటే, అందులో కొత్తగా వచ్చిన ఆరుగురు వైల్డ్‌కార్డ్స్‌లో దివ్వెల మాధురి, ఆయేషా హౌస్‌కు హైలైట్‌గా మారారు. వీరు తెచ్చిన ఉద్రిక్తత, డ్రామాతో హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. వారి వైఖరి, ప్రవర్తనపై ఇప్పడు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే, వీరిద్దరూ పాజిటివ్ కంటే ఎక్కువగా నెగటివ్ కారణాలకే హైలైట్ అవుతుండడం గమనార్హం.
అరుపులు, ఏడుపులకే పరిమితమా?
వైల్డ్‌కార్డ్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయేషా తన ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. నామినేషన్ల ప్రక్రియలో తనుజను నామినేట్ చేస్తూ.. హౌస్‌లో అరుపులు, ఏడుపులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అంటూ వాదించిన ఆయేషానే.. వచ్చినప్పటినుంచి గట్టిగా అరుస్తూ, కోపంగా మాట్లాడుతూ కనిపించింది. నిన్న ( అక్టోబర్ 17న ) జరిగిన ఒక గేమ్‌లో ఓటమిని తట్టుకోలేక చిన్నపిల్లలా బోరున ఏడ్చేసింది. ఇతరులకు నీతులు చెప్పి, తన వంతు వచ్చేసరికి మాత్రం అత్యంత బలహీనంగా ప్రవర్తించడం ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తోంది. ఆమె నిజంగా ఆట మీద శ్రద్ధ పెడుతుందా, లేక కేవలం ఎమోషనల్ డ్రామా ద్వారా హైలైట్ అవ్వాలని చూస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
హౌస్‌కు రెండో బిగ్‌బాసా?
మరో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ దివ్వల మాధురి ప్రవర్తన మరింత చర్చనీయాంశంగా మారింది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే తాను బిగ్‌బాస్‌లా ఫీల్ అవుతూ, అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ కల్యాణ్‌తో ఆమెకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ వీకెండ్ ఎపిసోడ్‌లో చర్చకు వచ్చింది. నాగార్జున ఈ గొడవ గురించి కెప్టెన్ సుమన్‌ను ప్రశ్నించగా, సుమన్ ఏమాత్రం తడుముకోకుండా గొడవలో మాధురిదే తప్పు అని తేల్చి చెప్పాడు. నాగార్జున ఆ గొడవ జరిగిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రత్యేకంగా వేసి మరీ చూపించారు. మాధురి మాట్లాడిన విషయంలో తప్పు లేకపోయినా, ఆమె మాట్లాడిన తీరు సరికాదని నాగ్ గట్టిగా క్లాస్ పీకాడు. తన గొంతే అలా ఉంటుందని మాధురి కవర్ చేసుకునే ప్రయత్నం చేయగా, నాగార్జున దాన్ని ఏమాత్రం అంగీకరించలేదు. మరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా! హౌస్‌లో నిలబడాలంటే మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది అని గట్టిగా హెచ్చరించాడు.
సూపర్ పవర్ రద్దు..
వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రోజు మాధురికి ఒక సూపర్ పవర్ లభించింది. అది ఎలిమినేషన్‌ను రద్దు చేసే అధికారం. అయితే, ఆమె ప్రవర్తనతో విసిగిపోయినట్టుగా కనిపించిన నాగార్జున.. మాధురికి ఉన్న ఈ సూపర్ పవర్‌ను ఉంచాలా, తీసేయాలా అని స్టూడియోలోని ప్రేక్షకులను అడిగాడు. ప్రేక్షకులు ఒక్కటై తీసేయడమే మంచిది అని తమ అభిప్రాయం చెప్పడంతో, మాధురి పవర్ ను తీసివేశారు.
►ALSO READ | K Ramp Review: ‘కె ర్యాంప్’ ఫుల్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
నాగార్జున క్లాస్ పీకడం.. వైల్డ్‌కార్డ్స్‌కు ఒక హెచ్చరికగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో కేవలం తమ ముద్రను చూపించడానికి గొడవలు పడటం, అరిచి గొడవ చేయడం, ఆధిపత్యం చూపడం కంటే సరైన ఆటతీరు, సభ్యతతో కూడిన ప్రవర్తన ఎంత ముఖ్యమో ఈ వారం ఎపిసోడ్ లో స్పష్టం చేసంది. వైల్డ్‌కార్డ్స్‌లో అంచనాలు అందుకున్నవారు తక్కువగా ఉండగా, మాధురి, ఆయేషా లాంటివారు మాత్రం త్వరగా తమ ట్రాక్‌ను మార్చుకోకపోతే, వారి ప్రయాణం ఇక్కడితో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆట మొదలైంది, జాగ్రత్త! అన్నట్టుగా ఉంది పరిస్థితి...