కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెంట్రల్ కేబినెట్ శుభవార్త చెప్పింది. నాలుగు శాతం డీఏ పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. 2019 జనవరి 1 నుంచి ఈ పెంచిన డీఏను వర్తింప చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. నాలుగు శాతం డీఏ పెంపుపై కేబినెట్‌లో ఆమోదించామని, ఈ నిర్ణయం ద్వారా 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.14,595 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

యెస్ బ్యాంకు సంక్షోభంపైనా చర్చ

కేబినెట్ సమావేశంలో యెస్ బ్యాంకు సంక్షోభంపైనా చర్చించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ సూచించిన రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ ప్రకారం ఎస్బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్దమైందని, దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపామని చెప్పారు.

More News:

భారతీయ సంప్రదాయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు..

ఆల్కహాల్‌తో కరోనాకు చెక్: అమెరికా హాస్పిటల్ పేరుతో ప్రచారం

బీరు దొంగిలించిన జంట అరెస్ట్.. పట్టించిన సీసీ కెమెరా