- రూ.5,181 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
- దేశీయంగా డెవలప్ చేసిన డీఆర్డీవో
- ఢిల్లీ చుట్టూ 30 కి.మీ. పరిధిలో భద్రత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని వీఐపీ–89 జోన్‌కు భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా డెవలప్ చేసిన ‘సుదర్శన్ చక్ర’ అనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీని విలువ సుమారు రూ.5,181 కోట్లు ఉంటుందని డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాలైన రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వంటి వీఐపీ జోన్ల రక్షణ కోసం సుదర్శన్ చక్రను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) డెవలప్ చేసింది.
ఎయిర్‌ఫోర్స్ సెంట్రిక్‌గా ఇది పని చేస్తుంది. డ్రోన్లు, మిసైళ్లు, శత్రు దేశాల విమానాల నుంచి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. ఢిల్లీ చుట్టూ 30 కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి ముప్పునైనా అడ్డుకోగల శక్తి సుదర్శన్ చక్రకు ఉన్నది.
