ఎన్టీపీసీ, బొగ్గు గనుల ప్రాంతాల టూరిజం అభివృద్ధికి ప్లాన్ లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

ఎన్టీపీసీ, బొగ్గు గనుల ప్రాంతాల టూరిజం అభివృద్ధికి ప్లాన్ లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: రామగుండం (ఎన్టీపీసీ), బెల్లంపల్లి (బొగ్గు గనులు) పారిశ్రామిక ప్రాంతాలను టూరిజం సెంటర్లుగా తీర్చిదిద్దేంకు తమ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని కేంద్రం వెల్లడించింది. అయితే బొగ్గు గనుల ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలను పరిశీలించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. సోమవారం లోక్‌‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌‌ షెకావత్‌‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఇండస్ట్రియల్‌‌ టూరిజం కోసం కేంద్రం విడిగా ఎటువంటి స్కీం అమలు చేయడం లేదని వెల్లడించారు. టూరిజం అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమన్నారు. రాష్ట్రాలు పంపే ప్రతిపాదనల మేరకు స్వదేశ్‌‌ దర్శన్, ప్రసాద్‌‌ వంటి స్కీంల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వదేశ్‌‌ దర్శన్‌‌ 2.0లో భాగంగా రాష్ట్రంలోని భువనగిరి కోట ఎక్స్‌‌పీరియెన్స్‌‌ జోన్‌‌ కోసం రూ. 56.82 కోట్లు, అనంతగిరి ఎకో టూరిజం కోసం రూ. 38.01 కోట్లు మంజూరు చేసినట్లు  వెల్లడించారు.