తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోడీ ట్వీట్

తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోడీ ట్వీట్

వాహనదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమని ట్వీట్ చేశారు.

తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేసే విధంగా ఉంటుందన్నారు. మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్ ను ఆయన జత చేశారు. సామాన్యులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని మంత్రి నిర్మలా సూచించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్ పై రూ. 9.50, డీజిల్ పై రూ. 7 తగ్గనుంది. దేశ రాజధానిలో ఆదివారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ. 95.91గా ఉండనుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41గా ఉంది. డీజిల్ ధర రూ. 89.67 కానుంది. ఇప్పుడు లీటర్ డీజిల్ ధర రూ. 96.67గా ఉంది.

 

మరిన్ని వార్తల కోసం : -

ఉజ్వల పథకం సిలిండర్పై రూ. 200 సబ్సిడీ


భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు