నీట్ రద్దుకు కేంద్రమే బాధ్యత వహించాలి..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల

నీట్ రద్దుకు కేంద్రమే బాధ్యత వహించాలి..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: నీట్ పరీక్ష రద్దుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయ న హైదరాబాద్​లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. నీట్ రద్దుతో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చామల ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దుపై బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చర్చ చేపట్టాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రద్దుతో మరోసారి తేటతెల్లమైందన్నారు. రాజస్తాన్​లో జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని చామల డిమాండ్ చేశారు.