- ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మార్పు రావాలి
- ఐ ప్రిజమ్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి
- స్టంట్స్ లేకుండా గుండెల్లో బ్లాక్స్ తీసెయ్యవచ్చు
- ప్రొఫెసర్ డాక్టర్ రఘుపతి
- ప్రిజమ్ మెడిసిన్‌పై ఒక్కరోజు సమావేశం
గచ్చిబౌలి, వెలుగు : ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో భారతదేశం చౌరస్తాలో ఉందని, ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఐ ప్రిజమ్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి అన్నారు. దేశంలో 4 కోట్ల మంది రోగులు చివరి దశలో ఉన్నందున సంప్రదాయ అల్లోపతిని దాటి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదివారం ఐటీ కారిడార్‌లోని టీ హబ్‌లో రెండు సంప్రదాయాలు ఒకే శాస్ర్తం పేరుతో ప్రిజమ్(పాలిసైంటిఫిక్ రీజెనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్) అంశంపై ఒక్కరోజు సమావేశం నిర్వహించారు. నేషనల్ఇంటిగ్రేటెడ్ మెడికల్అసొసియేషన్, ఐఐటీ హైదరాబాద్, అయూష్ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన ఈ సమావేశానికి ఆయుర్వేద, అల్లోపతి డాక్టర్లు, పలువురు వక్తలు హాజరయ్యారు.
ఐ ప్రిజమ్ ఫౌండర్డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ సంప్రదాయ అల్లోపతి వైద్యాన్ని మించి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల రోగులకు న్యాయం చేయలేమని, కొత్త శాస్త్రాలను రీసెర్చ్ చేయడం వల్ల ఫలితాలు వస్తాయన్నారు. ఆధునిక వైద్య శాస్త్రాల వల్ల మనిషి జీవితకాలం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
అమెరికన్హార్ట్ అసోసియేషన్ లెక్కల ప్రకారం గత 17 ఏండ్లలో 180 మిలియన్ల బైపాస్ సర్జరీలు జరిగాయని, తాను బైపాస్సర్జరీలకు వెళ్లవద్దని సలహా ఇస్తానని, తాను ప్రతిపాదించే బ్లాక్ రివర్సల్టెక్నాలజీని అనుసరించాలన్నారు. వాత, పిత్తం, కఫం ప్రమాణాలు, నాడీ పరీక్ష, సంప్రదాయ ఔషధాలు వంటి ఆయుర్వేద వైద్యం, భారతీయ అనుబంధ వైద్య వ్యవస్థ మెరుగుపడాలన్నారు.
అందుకోసమే పాలీసైంటిఫిక్ రీజెనరేటీవ్ ఇంటిగ్రేటీవ్ సిస్టమ్ మెడిసిన్ తీసుకొచ్చామన్నారు. ఐ ప్రిజమ్ఆధ్వర్యంలో మూడేండ్ల మెడిసిన్ కోర్సు డిసెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఫౌండర్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఇందులో మొదటి విడతగా 8 నెలల పాటు తరగతులు నిర్వహిస్తామని, ప్రస్తుతం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంబీబీఎస్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీటెక్ఈసీఈ కోర్సులు చేసిన వారు ఇందులో జాయిన్ కావొచ్చన్నారు.
ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ డీన్ డాక్టర్ నరహరశాస్త్రి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యాన్ని డాక్టర్లు ప్రోత్సహించాలన్నారు. ఆయుర్వేదిక్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రఘుపతి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రకాల జబ్బులను నయం చేయవచ్చని, స్టంట్స్ లేకుండా గుండెల్లో బ్లాక్స్ తీసెయ్యవచ్చన్నారు. ఎన్‌ఐఎంఏ ప్రెసిడెంట్డాక్టర్ అనిల్కుమార్పాటిల్, వక్తలు వి. ప్రకాశ్, వివి.రావు తదితరులు పాల్గొన్నారు.
