
హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు నేషనల్ గేమ్స్ హక్కులు కేటాయించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ కల్యాణ్ చౌబేను హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు కోరారు. ఫుట్‌బాల్ ఐ-లీగ్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్ శివార్లలోని డెక్కన్ ఏరీనాలో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ, నెరోకా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్‌కు బౌబే, జగన్, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి పాల్గుణ తదితరులు హాజరయ్యారు.
ఇటీవల హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా గెలిచిన జగన్‌ను చౌబే అభినందించారు.ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన భేటీలో నేషనల్ గేమ్స్ చర్చకు వచ్చింది. వచ్చే నాలుగేండ్లలో తెలంగాణకు నేషనల్ గేమ్స్‌ను కేటాయించాలని కోరగా.. కల్యాణ్ చౌబే సానుకూలంగా స్పందించారని జగన్ తెలిపారు.