మీరు రెడీనా : పోలింగ్ కోసం 2.50 లక్షల మంది సిబ్బంది..

మీరు రెడీనా : పోలింగ్ కోసం 2.50 లక్షల మంది సిబ్బంది..

నవంబర్ 30(గురువారం) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయిన ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికల పోలింగ్.. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్దమైంది...పోలింగ్ లో పాల్గొనే సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించామని వికాస్ రాజ్ వెల్లడించారు.

నవంబర్ 26 వరకు 1లక్షా 68వేల 612 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేయగా.. 96వేల 526 పోలింగ్ జరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హోమ్ ఓటింగ్ ద్వారా 26వేల 660 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు వికాస్ రాజ్. 

మరోవైపు ఎన్నిలకల  కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నియమాశలి ఉల్లంఘించిన క్రమంలో మొత్తం 709 కోట్లు విలువైన వస్తువులు, నగదు జప్తు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు నగదు, మద్యం, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. 

తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు.డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించనున్నారు.