పట్టణాల్లో నెమ్మదిగా పోలింగ్: వికాస్ రాజ్

పట్టణాల్లో నెమ్మదిగా పోలింగ్: వికాస్ రాజ్

హైదరాబాద్: పట్టణ  ప్రాంతాల్లో నెమ్మదిగా ఓటింగ్ సాగుతోందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత, కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోదరుడిపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఓటర్ల నుంచి మంచి స్పందన ఉందని, సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చామని చెప్పారు.

అర్బన్‌ ఏరియాల్లో పోలింగ్‌ నెమ్మదిగా కొనసాగుతోందని, మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని చెప్పారు.