గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) గా సీహెచ్ మధుమోహన్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.
అనంతరం వివిధ శాఖల ఆఫీసర్లు అడిషనల్ కలెక్టర్ కు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీనారాయణ రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో మధుమోహన్ బాధ్యతలు స్వీకరించారు.
