Chaaver Movie Review: ఓ హత్య చుట్టూ తిరిగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Chaaver Movie Review: ఓ హత్య చుట్టూ తిరిగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

మలయాళంలో ఇటీవల విడుదలై అనూహ్యమైన రెస్పాన్స్ దక్కించుకున్న మూవీ చావెర్. టినూ పప్పచ్చన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో.. కుంచాకో బోబన్ ప్రధానమైన పాత్రలో నటించారు. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇటీవలే సోనీలివ్ ఓటీటీలోకి వచ్చింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా.. ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:  
అశోక్ (కుంచాకో బోబన్) ముస్తఫా (మనోజ్) ఆసిఫ్ (సజిన్ గోపు) థామస్ (అనురూప్). ఈ నలుగురు కలిసి ప్లాన్ ప్రకారం ఒక కిరణ్ కుమార్ వ్యక్తిని నరికి చంపి అక్కడినుండి పారిపోతారు. ఆ హత్య నుండి తప్పించుకోవడానికి వేరే వేరే ప్లేసెస్ కు ప్రయాణిస్తూ ఉంటారు. కిరణ్ కుమార్ ను చంపిన వారిని వెంటనే పట్టుకొవాలని ఆ ఊరి వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉంటారు. 

దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. అయితే హత్య చేసే సమయంలో అశోక్ కాలికి గాయం అవుతుంది. హాస్పిటల్ కు వెళితే అనుమానం వస్తుందని.. తెలిసిన వ్యక్తి అరుణ్ (అర్జున్ అశోకన్)ను తమ వద్దకు రప్పించుకుంటారు. కారులో ఎవరూలేని ప్రదేశానికి వెళ్లి గాయానికి ట్రీట్ చేయించుకుంటారు. అయితే ఆ గాయం చుసిన అరుణ్ కు అనుమానం వస్తుంది. ఇక ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే అరుణ్ ను దింపేయాలనుకుంటారు కానీ.. పోలీసులు ఉండటంతో తమ వెంటే తీసుకెళ్తారు. అలా దట్టమైన అడవిలో ఒక్కో చోటు నుండి ఒక్కో చోటు మారుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో అరుణ్ కు ఊరిలో జరిగిన హత్య చేసింది వీళ్ళే అనే తెలుస్తుంది. దాంతో వాళ్ళ నుండి పారిపోవాలని ప్రయత్నిస్తాడు.

మరో పక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తుం ఉంటుంది. అలా వారికి హత్యతో సంబంధం ఉన్న ముస్తఫా గురించి తెలుస్తుంది. ఆ కోణంలో విచారన జరుపుతారు పోలీసులు. మరి చివరికి ఏమైంది? కిరణ్ కుమార్ ను ఎందుకు చంపారు? హత్యతో సంబంధం లేదని కిరణ్ ఏమయ్యాడు? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:
ఒక ఊరు.. నలుగురు హంతకులు.. హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఐదుగురు పాత్రల చుట్టూనే చావెర్ కథ తిరుగుతుంది. ఈ ఐదుగురు ప్రయాణించే జీప్, ఫారెస్టు ప్రాంతం, ప్రధానమైన పాత్రలు, పెద్దగా బడ్జెట్ అవసరం లేని కథ ఇది. ఇంత సింపుల్ కథని తన ప్రెజెంటేషన్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. మొదటి నుంచి చివరివరకూ ఒక్కచోట కూడా డ్రాప్ అవకుండా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఐదు పాత్రలు, వాటిని డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటాయి. ఇక ఇలాంటి థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ కు ఫారెస్ట్ లొకేషన్స్ తోడై సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ విషయంలో కెమెరామెన్ జింటో జార్జ్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాలి. జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. 

నటీనటులు:
యాక్టర్స్ అందరూ చాలా సహజంగా చేశారు. నిజంగా మన కళ్ళముందు ఇదంతా జరుగుతుందా అనే భావన కలుగుతుంది. మనకు తెలిసిన కాదా కాకుండా.. అసలు వీళ్లతో ఆ హత్య ఎవరు చేయించారు? అనే చివరిదాకా మెయిన్టైన్ చేసి.. చివరిలో వచ్చే ట్విస్టు ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవుతుంది. చాలా సింపుల్ కథతో, సింపుల్ బడ్జెట్ తో, తక్కువ క్యారెక్టర్స్ తో ఇంతా అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. 

ఇక మొత్తంగా చెప్పాలంటే చావెర్ మూవీ ఒక పొలిటికల్ థ్రిల్లర్.. లాస్ట్ ట్విస్టు హైలెట్