ఎమ్మెల్యే వల్లే హుస్నాబాద్​లోకి నీరు : చాడ వెంకట్​రెడ్డి

ఎమ్మెల్యే వల్లే హుస్నాబాద్​లోకి నీరు : చాడ వెంకట్​రెడ్డి
  •     సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి

హుస్నాబాద్, వెలుగు : ​ ఎమ్మెల్యే సతీశ్​​ వల్లే హుస్నాబాద్ పట్టణంలోకి వరద నీరు వచ్చిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన వరద మళ్లింపుకాల్వ నిర్మించి ఉంటే హుస్నాబాద్​లో ఇండ్లళ్లోకి నీళ్లు వచ్చేవి కాదన్నారు. హుస్నాబాద్​లో ఇటీవల వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను మంగళవారం ఆయన పరిశీలించారు. 2008లో రూ.83లక్షలతో వరద మళ్లింపు కాల్వ నిర్మించతలపెట్టామని, ఇప్పటి పాలకులు దానిని విస్మరించడంతో హుస్నాబాద్​ ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా వరద ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేశ్, జాగీర్ సత్య నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అయిలేని సంజీవరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, అక్కన్నపేట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి నేలవేని స్వప్న, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల ఉపాధ్యక్షురాలు జంగ విజయ తదితరులున్నారు.