చాదర్ఘాట్ కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు ..మరో నిందితుడి కోసం గాలింపు

చాదర్ఘాట్ కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు ..మరో నిందితుడి కోసం గాలింపు

 బషీర్​బాగ్, వెలుగు: డీసీపీ చైతన్య కుమార్ ఫిర్యాదుతో చాదర్​ఘాట్​కాల్పుల ఘటన కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు కొసాగుతోంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్లో ఒకరైన అన్సారీ బుల్లెట్‌‌‌‌ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం విక్టరీ ప్లేగ్రౌండ్ వద్ద మొబైల్ స్నాచింగ్​కు పాల్పడిన దుండగులను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్, గన్ మెన్​మూర్తి వెంబడించారు. 

వారిలో ఒకడు పారిపోగా... అన్సారీ ఎదురుదాడికి దిగాడు. తన వద్ద ఉన్న కత్తితో గన్​మెన్‌‌‌‌ను పొడిచేందుకు యత్నించాడు. గన్‌‌‌‌ మెన్​ను కాపాడే క్రమంలో రౌడీషీటర్‌‌‌‌ను డీసీపీ వెనక్కి నెట్టారు. తోపులాటలో చైతన్యకుమార్‌‌‌‌ కిందపడిపోగా... స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గన్‌‌‌‌ మెన్​పై కత్తితో దాడిచేస్తున్న అన్సారీపై డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం అన్సారీ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, మరో నిందితుడి కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన పరిసరాల్లోని ప్రతి ఇంటి సీసీటీవీ ఫుటేజీను సేకరించి, నిందితుల కదలికలను విశ్లేషిస్తున్నారు. 

సీసీ ఫుటేజీలో కొన్ని క్లిప్స్‌‌‌‌ ఆధారంగా ముఖ్యమైన ఆధారాలు దొరికినట్లు సుల్తాన్​బజార్ ఇన్​స్పెక్టర్ నరసింహ తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్‌‌‌‌ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.. సాధారణ ప్రజలను అక్కడికి అనుమతించడం లేదు. పరారీలో ఉన్న నిందితుడు గ్రిల్స్‌‌‌‌ దూకి రోడ్డుపైకి వచ్చి, ఆర్టీసీ బస్సులో తప్పించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితుడు పట్టుకుంటామని సుల్తాన్‌‌‌‌ బజార్‌‌‌‌ పోలీసులు తెలిపారు.