చౌరస్తాలో చాయ్​ చేసి సంబురాలు

చౌరస్తాలో చాయ్​ చేసి సంబురాలు

కరీంనగర్ సిటీ , వెలుగు : కాంగ్రెస్ హాయాంలోనే మహిళలకు పెద్దపీట  వేయడం జరుగుతుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి అన్నారు.  వంట గ్యాస్ సిలిండర్ రూ.5 వందలకు,200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో బుధవారం ఇందిరాచౌక్ లో స్వీట్లు పంచి, సిలిండర్​ మీద టీ పెట్టి  సంబురాలు జరుపుకున్నారు.  

అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు  పక్కా అమలు చేస్తామని అన్నారు.  కార్యక్రమంలో నాయకులు భారతమ్మ , సుశీల, పుష్పలత ,కవ పద్మ ,దేవేంద్ర, పద్మ, కవిత ,జ్యోతి ,రజిత, సునీత, లక్ష్మి ,లావణ్య, కరీమా, రమాదేవి పాల్గొన్నారు.