వడ్డీ డబ్బులతో క్రికెట్ బెట్టింగ్.. అప్పు తీర్చడానికి చైన్ స్నాచింగ్

వడ్డీ డబ్బులతో క్రికెట్ బెట్టింగ్.. అప్పు తీర్చడానికి చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : కరోనా టైంలో జాబ్ పోయిన ఓ యువకుడు.. ఎలాగైనా డబ్బు సంపాధించాలని క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. మ్యాచ్ లు  ఓడిపోవడంతో .. అప్పులపాలయ్యాడు. ఎలాగైనా అప్పులు తీర్చాలని దొంగ అవతారమెత్తిన ఆ యువకుడు.. చైన్ స్నాచింగ్ చేయడం మొదలు పెట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాలు: హైదరాబాద్ లోని నేరేడ్ మెట్, డిఫెన్స్ కాలనీలో నివసించే రవిపాటి ఇందిర అనే మహిళ శుక్రవారం ఉదయం రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుంది.

అదే సమయంలో ఆమె వెనుకనుండి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, ఆమె మెడలోని 4.5 తులాల మంగళసూత్రాన్ని లాక్కుపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న  ముగ్గురు స్థానికులు వెంటనే వెంబడించి, నిందితుడుని పట్టుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నేరేడ్ మెంట్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్ కి తరలించారని తెలిపారు.