రాగన్నగూడలో చైన్ స్నాచింగ్.. వృద్ధురాలి మెడ నుంచి గొలుసు లాక్కొని తోటలోకి జంప్

రాగన్నగూడలో చైన్  స్నాచింగ్.. వృద్ధురాలి మెడ నుంచి గొలుసు లాక్కొని తోటలోకి జంప్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​మునిసిపాలిటీ రాగన్నగూడలో చైన్​స్నాచింగ్​ జరిగింది. ఆదిబట్ల సీఐ రవికుమార్​ తెలిపిన ప్రకారం.. రాగన్నగూడలో నివాసముండే వృద్ధురాలు దశరథి చెన్నమ్మ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఎన్టీఆర్​ నగర్‌‌లోని కూరగాయల మార్కెట్​కు బయలుదేరింది. రాగన్నగూడా సబ్​ స్టేషన్​ సమీపంలో వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పక్కనే ఉన్న తోటలోకి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.