శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ బీఎస్ రావు కన్నుమూత

శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ బీఎస్ రావు కన్నుమూత

శ్రీ చైతన్య కాలేజీ అనగానే చదువులకు, ర్యాంకులకుపెట్టింది పేరు. అలాంటి కాలేజీని స్థాపించింది డాక్టర్ బి.ఎస్​.రావు.. బొప్పన సత్యనారాయణ రావు. శ్రీచైతన్య కాలేజీల చైర్మన్ అయిన బీఎస్​ రావు.. హఠాత్తుగా చనిపోయారు. 

ఇంట్లోని బాత్రూంలో కాలు జారి పడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. హైదరాబాద్ లో.. జులై 13వ తేదీన ఈ ఘటన జరిగింది. విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించాలన్న కుటుంబ సభ్యుల నిర్ణయంతో.. బీ.ఎస్. రావు భౌతికకాయాన్ని బెజవాడ తరలించారు. 

జులై 14న ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది డాక్టర్లు చైతన్య విద్యాసంస్థల నుంచి వచ్చారు. దీనికి తోడు ఆయన పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన అకస్మాత్తు మరణంతో విద్యాసంస్థల సిబ్బంది.. విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్న లక్షలాది మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆయన మృతితో.. కాలేజీ జ్ణాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

బొప్పన సత్యనారాయణ రావు తొలినాళ్లలో యూకే, ఇరాన్ లో డాక్టర్ గా పని చేశారు. అనంతరం భార్యతో కలిసి 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని పెట్టారు. 

విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీరి కాలేజీలు నెలకొల్పారు. మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను వీరు నడుపుతున్నారు.