చక్రవర్తి బౌలర్ నం.1.. తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం

చక్రవర్తి బౌలర్ నం.1.. తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం

దుబాయ్‌‌‌‌: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌‌‌‌లో తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఇండియా మూడో జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్  సరసన నిలిచాడు. 34 ఏండ్ల వరుణ్ ఆసియా కప్‌‌‌‌లో  యూఏఈ (1/4), పాకిస్తాన్‌‌‌‌ (1/24)పై అద్భుతంగా రాణించడంతో బుధవారం (సెప్టెంబర్ 17) విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో రెండు నుంచి ఒకటో ప్లేస్‌‌‌‌ అందుకున్నాడు. 

మార్చి నుంచి టాప్‌‌‌‌లో ఉన్న న్యూజిలాండ్‌‌‌‌ బౌటర్ జాకబ్ డఫీని వెనక్కునెట్టాడు.  ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌‌‌‌కు చేరుకోగా.. అక్షర్ పటేల్ 12వ స్థానంలో, బుమ్రా 40వ  ర్యాంక్‌‌‌‌లో నిలిచారు. బ్యాటింగ్‌‌‌‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ నంబర్ వన్‌‌‌‌ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. తన కెరీర్‌‌‌‌లో అత్యధికంగా 884 రేటింగ్ పాయింట్లను సాధించాడు.