ఫెడరల్ వ్యవస్థను సవాల్ చేస్తారా?.. కేరళ సీఎం‌పై రాజ్‌నాథ్ ఫైర్

ఫెడరల్ వ్యవస్థను సవాల్ చేస్తారా?.. కేరళ సీఎం‌పై రాజ్‌నాథ్ ఫైర్

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయ్ విజయన్‌‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ విమర్శలకు దిగారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర ఏజెన్సీలపై విచారణకు ఆదేశించిన విజయన్ సర్కార్ నిర్ణయం సరికాదంటూ రాజ్‌నాథ్ ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికీ మన రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థను సవాల్ చేయడమేనన్నారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌‌నాథ్ పైవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే శబరిమల సంప్రదాయాలు, గౌరవాన్ని రక్షిస్తామని స్పష్టం చేశారు. కేరళలో తాము పవర్‌‌లోకి రాబోతున్నామని తెలిపారు. అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌‌ రాష్ట్రంలో నెలకొల్పిన రాజకీయ గందరగోళం, హింసకు స్వస్తి పలుకుతామని తెలిపారు. కేరళకు రాజకీయంగా ఓ ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందని, అది బీజేపీ రూపంలో సిద్ధంగా ఉందన్నారు.