కూల్చివేతకు నిరసనగా నేడు చలో సెక్రటేరియెట్

కూల్చివేతకు నిరసనగా నేడు చలో సెక్రటేరియెట్

‘ప్రజాస్వామిక తెలంగాణ’ ఆధ్వర్యంలో నిరసన

ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్ష ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం గురువారం ఉదయం జరగనుంది. ఉదయం 10 గంటల సమయంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించి.. 11 గంటల టైమ్ లో సెక్రటేరియట్​కు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ నిరసనకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేఎస్, లెఫ్ట్​పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సెక్రటేరియట్ భవనాలు, ఎర్రమంజిల్​ కూల్చివేతకు నిరసనగా జి.వెంకటస్వామి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఇటీవలే అఖిలపక్ష సమావేశాలు నిర్ణయించింది. అన్ని పార్టీల నేతలు చర్చలు జరిపి, ప్రభుత్వ తీరును నిరసనగా 25న ‘చలో సెక్రటేరియెట్’ చేపట్టాలని నిర్ణయించారు. అఖిలపక్ష భేటీలో చేసిన తీర్మానాన్ని మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి.. నేతలతో కలిసి గవర్నర్​ నరసింహన్​కు అందజేశారు. తీర్మానాన్ని కేంద్ర మంత్రి అమిత్​షాకు కూడా వివేక్​ అందించారు.