Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. టైటిల్ విజేత, రన్నరప్‌కు ప్రైజ్ మనీ ఎంతంటే..?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. టైటిల్ విజేత, రన్నరప్‌కు ప్రైజ్ మనీ ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) రెండు జట్లు ఈ బ్లాక్ బస్టర్ సమరంలో అమీతుమీ తెలుసుకోనున్నాయి. టోర్నీ మొత్తం ఓటమి లేకుండా అద్భుతంగా ఆడిన టీమిండియా ఈ మ్యాచ్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు జరుగుతుంది. టాస్ 2:00 గంటలకు వేస్తారు. స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18, జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌ ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు జాక్ పాట్ లభించనుంది. విజేత, రన్నరప్ లకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. 

ALSO READ | Kapil Dev: కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్స్..ధోనీ కంటే గొప్పోడు: భారత మాజీ దిగ్గజ క్రికెటర్

పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో గెలిచిన జట్టు భారీ మొత్తం అందుకోనుంది. విజేతగా నిలిచిన జట్టుకు $2.24 మిలియన్లు ప్రైజ్ మనీ దక్కనుంది. భారత కరెన్సీలో ఇది అక్షరాలా రూ.19.49 కోట్ల రూపాయాలు. చివరిసారిగా జరిగిన 2017 ఎడిషన్ కంటే 53 శాతం టోర్నీ ప్రైజ్ మనీ పెరగడం విశేషం. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్లు (రూ. 9.74 కోట్లు) అందజేస్తారు. 

ఫైనల్లో ఇండియా గెలిస్తే గ్రూప్-స్టేజ్ ప్రైజ్ మనీతో సహా $2.46 మిలియన్లు (సుమారు రూ. 21.4 కోట్లు) గెలుచుకుంటారు. అయితే  ఓడిపోతే మాత్రం సుమారు రూ 11.2 కోట్లు అందుకుంటారు.సెమీఫైనల్ లో ఓడిపోయిన జట్లకు రూ. 5.20 కోట్లు.. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి గెలుపుకు రూ. 29.5 లక్షలు లభిస్తాయి. ఐదవ, ఆరవ  స్థానంలో నిలిచిన జట్లకు రూ.3.04 కోట్లు.. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లకు రూ. 1.21 కోట్లు ప్రైజ్ మనీ దక్కుతుంది. 

భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ పై కివీస్ దే పై చేయి. ఈ మ్యాచ్ లో భారత్ ను న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు ఫైనల్స్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటానికి భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్ గెలిచిన రెండు ఐసీసీ టోర్నీలో భారత్ పైనే గెలవడం విశేషం.   

భారత్ విషయానికి వస్తే 2002లో గంగూలీ కెప్టెన్సీలో శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది. శ్రీలంక ఆతిధ్యమిచ్చిన ఈ టోర్నీ ఫైనల్ వర్షం కారణంగా జరగలేదు. 2013 లో భారత్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరగబోయే ఫైనల్లో ఏ జట్టు గెలిచినా రెండో సారి ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18, జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌ ప్రసారమవుతుంది.