హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ద్రోహం చేసిన వారే.. ఇప్పుడు ధర్నా చౌక్ లో నల్ల అంగీ వేసుకొని ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తుంటే కేటీఆర్ ఇప్పుడు నిరసన తెలపడం సిగ్గుచేటన్నారు.
