ఆడపిల్ల పుడితే వెండి నాణెం ఇస్తం

ఆడపిల్ల పుడితే వెండి నాణెం ఇస్తం

చంద్రపూర్: దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్​ఎమ్మెల్యే ఓ కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. చంద్రాపూర్​ మున్సిపాలిటీ వాసులకు లోకల్​ఎమ్మెల్యే కిశోర్​ జోర్గేవార్ ఓ ఆఫర్​ ప్రకటించారు. తాను కన్వీనర్​గా ఉన్న శ్రీ మహంకాళీ సేవా సమితి తరఫున ఈ ప్రకటన చేశారు.

మునిసిపాలిటీ పరిధిలో ఈ తొమ్మిది రోజుల్లో ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులకు వెండినాణెం బహుకరిస్తామని చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులు బర్త్​ సర్టిఫికెట్ తో చాందా మహంకాళీ టెంపుల్ లోని సేవా సమితి ఆఫీసులో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని ఆయన కోరారు.