టీడీపీని దెబ్బతీద్దామని  విఫలమయ్యారు..  రాజకీయ రౌడీలు... ఖబడ్దార్

టీడీపీని దెబ్బతీద్దామని  విఫలమయ్యారు..  రాజకీయ రౌడీలు... ఖబడ్దార్

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండడమే టీడీపీ బలం అని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ రౌడీలు... ఖబడ్దార్... జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని తెలిపారు.

ఉద్యోగులకు జీతాలు రావడం లేదు...

వైసీపీ హయాంలో  ఉద్యోగులకు జీతాలు రావడం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీపై నమ్మకంతో రాజధాని కోసం  అప్పట్లో రైతులు భూములు ఇచ్చారంటూ .. తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.   నాలుగేళ్లలో జగన్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. . వైసీపీ నేతలది అహంకారంతో కూడిన పాలన చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

 

జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి

మహానాడుకు పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా?. వైసీపీ నేతలు  చిల్లర, పనికిరాని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ధరల బాదుడుతో పేదలపై భారం మోపుతున్నారు.  వైసీపీ నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేస్తామని చంద్రబాబు అన్నారు. జగన్ అసమర్థతతో రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.  వైసీపీ హయాంలో   రాష్ట్రంలో డగ్స్, గంజాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని ప్రజలు నమ్ముతున్నారు. . మళ్లీ టీడీపీ అవసరం వచ్చింది.. సమయం లేదు మిత్రమా’’ అని చంద్రబాబు గర్జించారు. తాను వేసిన ఫౌండేషన్ వల్లే ఇప్పుడు తెలంగాణకు భారీ ఆదాయం వచ్చిందని మహానాడు ముగింపు సభలో చంద్రబాబు తెలిపారు.