వరుస టూర్లతో చంద్రబాబు, లోకేష్ బిజీ - పొత్తు ఫలించేనా..?

వరుస టూర్లతో చంద్రబాబు, లోకేష్ బిజీ - పొత్తు ఫలించేనా..?

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు వరుస టూర్లతో బిజీగా మారారు. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి చవిచూసిన టీడీపీ రాబోయే 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన, బీజేపీలతో కలిసి బరిలో దిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొన్న చంద్రబాబు ఢిల్లీ అమిత్ షా ని కలిసాక పొత్తు విషయంలో సానుకూల పవనాలు మొదలయ్యాయి.

చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రమంతటా పర్యటిస్తూ వరుస బహిరంగ సభల్లో అధికారపార్టీని వైఫల్యాలను ఎండగడుతూ స్పీచ్ లు ఇస్తూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన చంద్రబాబు బాపట్ల సభ, లోకేష్ గాజువాక సభలు సక్సెస్ అవ్వటంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని చెప్పాలి.

సభలు, టూర్ల మాట అటుంచితే, 2024 ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంకా విపక్షాల మధ్య పొత్తు, సీట్ల పంపకం విషయం కొలిక్కి రాకపోవటం క్యాడర్ ను టెన్షన్ పెడుతోంది. 22న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ టూర్ తర్వాత అయినా పొత్తు, సీట్ల విషయంలో క్లారిటీ వస్తుందేమోనని ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.

Also Read : స్పీడ్ పెంచిన పవన్, వైజాగ్ టూర్లో ఇన్ ఛార్జ్ ల ప్రకటన - పొత్తు సంగతేంటి..?