చికిత్స తరువాత చంద్రబాబు మళ్లీ జైలుకెళ్లాల్సిందే: సజ్జల

చికిత్స తరువాత చంద్రబాబు మళ్లీ జైలుకెళ్లాల్సిందే: సజ్జల

చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై హాట్‌ కామెంట్లు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందించాల్సిన అంశమే కాదన్నారు. చికిత్స తరువాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేన్నారు.  మధ్యంతర బెయిల్‌ వచ్చిందని సంబరాలు చేసుకునే వారికి సిగ్గు ఉందా? అంటూ మండిపడ్డారు. వ్యవస్థను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటికీ ఎలా వచ్చారు. నువ్వు రోగీవా..? వీర యోధుడివా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేసు మెరిట్ చర్చ జరిగిందా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పించుకోవడానికి వీలు లేదు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేశారని సజ్జల ఆరోపించారు. రాజమండ్రి నుంచి ర్యాలీ నిర్వహిస్తామని అంటున్నారని ప్రజలు ఏమనుకుంటారని సజ్జల ప్రశ్నించారు. .చంద్రబాబుకు కంటి శస్త్ర చికిత్స కు సంబంధించిన అంశానికి మాత్రమే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, ఎక్కడ గెలిచింది నిజం? స్కిల్ స్కాం జరుగలేదా?పెండ్యాల శ్రీనివాస్ పారిపోవటం వెనుక పాత్ర ఎవరిది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు

 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు బయటకు ఎలా వస్తాడు? అని నిలదీశారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ... వైసీపీ పార్టీకి వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు లేదని తేలిపోయిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. . స్కిల్‌ కేసులో డబ్బులు షెల్‌ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా అని ప్రశ్నించారు. సానుభూతి కోసం బెయిల్‌ తెచ్చుకుని.. జనాలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని కోరారు.