
జనసేన అధినేతపై ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ మళ్లీ వస్తా అని చెప్పి కనిపించకుండా పోయారని అన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో మాట్లాడిన చంద్రబాబు అనంతపురం కరవు జిల్లా అని, ఆదుకుంటానని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని.. మళ్లీ వస్తానని మాటలు చెప్పిన పవన్ కల్యాణ్ కనిపించడం లేదు. అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో అభిమానం, మంచి మనసు ఉండే ప్రజానీకం, రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లా అనంతపురం అని నిరూపిస్తానని ‘ అని అన్నారు.