ప్రభుత్వ భూములను కొట్టేసేందుకే జగన్​ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది: చంద్రబాబు

ప్రభుత్వ భూములను కొట్టేసేందుకే జగన్​ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, టీడీపీ విజయం ఖాయం అంటున్నారు చంద్రబాబు.  కడపకు స్టీల్​ ప్లాంట్​ ఇవ్వలేని దద్దమ్మ సీఎం జగన్​  అంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. కడప జిల్లాలో రా కదిలిరా సభలో నిప్పులు చెరిగారు చంద్రబాబు

రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితిలు ఉన్నా... అభివృద్ది చెందలేదన్నారు.  సీమ ప్రాంతంలో సాగు నీరు పారితే రతనాల సీమగా మారుతుందని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆలోచించేవారని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్ట్​లను రూపొందించిన ఎన్టీఆర్​... రైతులకు తెలుగుదేశం హయాంలో పనిముట్లు ఇచ్చామన్నారు. 

వైసీపీ ప్రభుత్వంలో అన్ని కులాల వారు నష్టపోయారంటూ.... రెడ్డి సామాజిక వర్గంలోని ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్​ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి లాంటి వాళ్లు బాగుపడ్డారని విమర్శించారు.  29 మంది దళిత ఎమ్మెల్యేలను వైసీపీ అధినేత జగన్​ ట్రాన్సఫర్​ చేశాడంటూ... ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు జగన్​ ప్రభుత్వం కొత్తచట్టం తీసుకొచ్చిందన్నారు చంద్రబాబు.

జగన్ సామజిక న్యాయం గురుంచి మాట్లాడటం హాస్యా స్పదంగా ఉందన్న చంద్రబాబు.. ప్రొద్దుటూరు లో నందం సుబ్బయ్యను వైసీపీ నాయకులు దారుణంగా హత్య చేసి..బాపట్లలో అమరనాధ్ గౌడ్ ను సజీవ దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ లో దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత  జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక  నంద్యాల లో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.