చంద్రబాబు పోలవరం సర్వే.. అధికారులు డుమ్మా

చంద్రబాబు పోలవరం సర్వే.. అధికారులు డుమ్మా

అధికారంలో లేనప్పడు ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈసీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అవేవీ పట్టని చంద్రబాబు .. ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని ఏరియల్ సర్వే చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పోలవరం ఏపీ ప్రజల చిరకాల వాంఛని.. ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 70.17శాతం పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు 90సార్లు వర్చువల్‌ ఇన్స్‌ఫెక్షన్‌ చేశామని చెప్పుకొచ్చారు. పోలవరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. ప్రాజెక్ట్ పూర్తయితే కరువును అధిగమించవచ్చన్నారు. ఈ ఏడాది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు.

ఈ పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ హాజరు కాలేదరు. పరిమిత సంఖ్యలోనే అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ  శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు.