హెరిటేజ్ షేర్లు కొన్నోళ్ల పంట పండింది.. 5 రోజుల్లోనే 250 రూపాయలు లాభం

హెరిటేజ్ షేర్లు కొన్నోళ్ల పంట పండింది.. 5 రోజుల్లోనే 250 రూపాయలు లాభం

స్టాక్ మార్కెట్ లో రియల్ బూం షేర్లు ఎవైనా ఉన్నాయా అంటే అది.. ఒక్క హెరిటేజ్ షేర్. అవును.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటమే కాకుండా దేశంలో మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావటంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు. ఈయనకు చెందినదే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ. 2024 జూన్ 4వ తేదీ దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ రోజు 426 రూపాయల దగ్గర ఓపెన్ అయ్యింది షేర్ ధర. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా.. దేశంలో కూటమిలో కీలక భాగస్వామ్యంగా టీడీపీ మారటంతో అమాంతం హెరిటేజ్ షేరు ధర పెరిగింది. 2024 జూన్ 10వ తేదీ నాటికి ఒక్కో షేరు 700 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 

కచ్చితంగా చెప్పాలంటే నెల రోజుల్లోనే డబుల్ అయ్యింది హెరిటేజ్ ఫుడ్ షేర్ ధర. మే 29వ తేదీ 371 రూపాయలు ఉంది. జూన్ 4వ తేదీ ముగింపు ధర 455 రూపాయలుగా ఉంది. ఆ తర్వాత కేవలం 5 సెషన్స్ అంటే.. ఐదు రోజుల్లోనే 700 రూపాయలకు చేరింది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం.. చంద్రబాబుకు బీజేపీ మరింత సపోర్ట్ ఇస్తుండటం.. ఏపీలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయటం వంటి కారణాలతో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర అమాంతం పెరిగింది. నెల రోజుల్లోనే డబుల్ అయ్యింది. ఐదు రోజుల్లోనే 250 రూపాయల వరకు పెరిగింది. 

మొత్తానికి హెరిటేజ్ షేర్లు ఉన్న వారు లక్కీ పర్సన్స్.. హెరిటేజ్ లో పెట్టుబడి పెట్టినోళ్లు.. ఆ షేర్లు కొనుగోలు చేసిన వాళ్లు ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నారు.. ఐదు రోజుల్లోనే 70 శాతం లాభాలు అంటే మాటలా ఏంటీ.. లక్ష పెట్టుబడికి లక్షా 75 వేల రూపాయలు ఐదు రోజుల్లోనే తీసుకోవటం ఆనందమే కదా.. 10 లక్షలు పెట్టినోళ్లు.. 5 రోజుల్లోనే ఏడు లక్షల రూపాయల లాభం చూశారు.. రాబోయే రోజుల్లో హెరిటేజ్ షేరు ధర మరింత పెరుగుతుందా లేదా అనేది చూడాలి..