ఫారిన్ పార్టనర్ల కోసం ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ వెతుకులాట

ఫారిన్ పార్టనర్ల కోసం ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ వెతుకులాట

ముంబై : ముంబై హై ఆయిల్ ఫీల్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ పెంచేందుకు  ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టనర్ల కోసం  ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ వెతుకుతోంది. ఫీజును (ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పెరిగిన ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చిన రెవెన్యూలో కొంత వాటాను ఆఫర్ చేస్తోంది. కానీ, ఈక్విటీ వాటాను ఇవ్వడం లేదు. గ్లోబల్ టెక్నికల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్ల (టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ)  కోసం ఇంటర్నేషనల్ టెండర్లను ఈ నెల 1న ఓఎన్‌‌జీసీ  పిలిచింది. ఈ ఏడాది  సెప్టెంబర్ 15 వరకు టెండర్ వేయొచ్చు.

ఏడాదికి కనీసం  75 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధిస్తున్న కంపెనీలే టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడానికి అర్హులు. ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవసరమయ్యే టెక్నాలజీ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ అందించాల్సి ఉంటుంది. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెర్ఫార్మెన్స్ రివ్యూని చేపట్టాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీతో 10 ఏళ్ల కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ కుదుర్చుకుంటుంది.

ముంబై హై ఆయిల్ ఫీల్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రస్తుతం రోజుకి 1,34,000 బ్యారెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్, 13 బిలియన్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతోంది. 1989 లో ఈ ఫీల్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రోజుకి 4,76,000 బ్యారెల్స్ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 28 బిలియన్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇదే పీక్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆ తర్వాత నుంచి ప్రొడక్షన్ తగ్గుతూనే ఉంది.