ఆన్ లైన్ లో యూరియా అమ్మకాలతో ఇబ్బందులు...యాప్ను మార్చాలని బీజేపీ నేతల డిమాండ్

ఆన్ లైన్ లో యూరియా అమ్మకాలతో ఇబ్బందులు...యాప్ను మార్చాలని  బీజేపీ నేతల డిమాండ్

వర్ని/ఆర్మూర్/బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్​వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నిజామాబాద్​జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులాచారి డిమాండ్​చేశారు. శుక్రవారం రుద్రూర్​, మోస్రా మండల కేంద్రాల్లో ఆయన పర్యటించి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో యూరియా యాప్​తీసుకొచ్చారని, బుకింగ్​ చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

తహసీల్దార్​ ఆఫీస్​ ముందు ఆందోళన

యూరియా బుకింగ్ యాప్ ను మార్చాలని డిమాండ్​చేస్తూ నిజామాబాద్​ జిల్లా ఆలూర్ తహసీల్దార్ ఆఫీస్​ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించి తహసీల్దార్​కు మెమోరాండం అందజేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి  పోల్కం వేణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ను తీసుకొచ్చి రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఎకరానికి యూరియా కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టత  ఇవ్వాలని కోరారు. ఎరువుల బుకింగ్ యాప్‌‌‌‌‌‌‌‌లో మండల స్థాయి ప్రాతిపదికను తొలగించి, స్థానిక సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపులకు యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మార్వో శ్రీనివాస్ కు బీజేపీ లీడర్లు విన్నవించారు.