సమన్వయంతో పనిచేయాలి : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

సమన్వయంతో పనిచేయాలి : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 

మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.  అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన 37 మంది, మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.