వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని ఆఫీసుల నుంచి ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లు పంపించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలతో సంక్షేమ పథకాల అమలుపై రివ్యూ చేశారు. ఈ ఆఫీస్, ఇందిరమ్మ ఇళ్ల గుడిసెల సర్వే, సర్, భూభారతి పెండింగ్ కేసులు, ఏకరూప దుస్తుల పంపిణీపై రివ్యూ చేసి పలు సూచనలు చేశారు.
భూభారతి ఫైళ్లు ఈ ఆఫీస్ ద్వారానే పంపించాలన్నారు. గుడిసెలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు త్వరగా సర్వే చేయించి నివేదిక అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, ఆర్థిక ఇబ్బందులతో పనులు ప్రారంభించని పేదలతో మాట్లాడి ఇల్లు కట్టుకునేలా చూడాలని సూచించారు.
