దుబాయ్ మృతుల కుటుంబాలకు..బుర్జీల్  ప్రతినిధుల ఆర్థికసాయం

దుబాయ్ మృతుల కుటుంబాలకు..బుర్జీల్  ప్రతినిధుల ఆర్థికసాయం

జగిత్యాల, వెలుగు: ఇటీవల దుబాయ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు బుర్జీల్  హోల్డింగ్స్  చైర్మన్  డా. షంషీర్  వయలిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూ.2.60 కోట్ల (10 లక్షల దిర్హాంలు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించారు. శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. బుర్జీల్  హోల్డింగ్స్  చైర్మన్, ప్రతినిధులు ఎ.విజయ్ కుమార్, అహ్మద్  బిన్  సులేమాన్, ఎం.ఉన్నికృష్ణన్, డా.పంకజ్ కుమార్  భట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష దిర్హాంలు(సుమారు రూ.26 లక్షలు) చొప్పున ఆర్థికసాయం అందనున్నట్లు చెప్పారు. గాయపడిన వారికి వైద్యం, పునరావాసం, పిల్లల విద్య కోసం సాయం అందించనున్నారు. డా.షంషీర్  వయలిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బుర్జీల్  ప్రతినిధులను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాలని ఎమ్మెల్యే ఆహ్వానించారు. సీఎం సమక్షంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.