దేశంలో కాంగ్రెస్ కనుమరుగు ఖాయం..బీజేపీకి కాంగ్రెస్ పోటీకాదు

దేశంలో కాంగ్రెస్ కనుమరుగు ఖాయం..బీజేపీకి కాంగ్రెస్  పోటీకాదు
  •     మెదక్​ ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట, వెలుగు: వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్  రాబోయే రోజుల్లో కనుమరుగు అవుతుందని మెదక్  ఎంపీ రఘునందన్‌‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఓటు చోరీ.. సీటు చోరీ.. గురించి మాట్లాడే సీఎం నెహ్రూ ఎలా ప్రధాని అయ్యారో తెలుసుకోవాలని సూచించారు. 

ప్రధాని పదవి కోసం ఓటింగ్  పెడితే సర్దార్​ వల్లభాయ్  పటేల్ కు 16 ఓట్లు వస్తే నెహ్రూకు ఒకే ఓటు వచ్చినా ఆయనకే పదవి దక్కిందని గుర్తు చేశారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు వారసత్వ రాజకీయాలకే మద్దతు తెలుపుతున్నారని, బీజేపీకి కాంగ్రెస్  పోటీనే కాదన్నారు. ఢిల్లీలో సుభాష్  చంద్రబోస్  విగ్రహం  పెట్టేందుకు కాంగ్రెస్  భయపడిందన్నారు. 

చాయ్  అమ్మిన వ్యక్తి పీఎం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్  అవినీతి, బీజేపీ మంచి పనులపై చర్చించడానికి తాను సిద్దమని సవాల్  చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్  ముదిరాజ్,  వేణుగోపాల్, సంతోష్, బాసంగారి వెంకట్  పాల్గొన్నారు.