టాటా మోటార్స్ షాక్ ఇచ్చింది. 2026, జూలై ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది కంపెనీ. జూలై ఒకటో తేదీ నుంచి అన్ని కార్లపై ధరలు పెరగబోతున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్, ప్యాసింజర్ వెహికల్స్ అన్ని మోడళ్ల కార్లపై ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది టాటా మోటార్స్.
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలపై ఒకటిన్నర శాతం ధర పెరగనుందని.. అంటే 10 లక్షల రూపాయల కారుపై 15 వేల రూపాయలు పెరగనున్నట్లు వివరించింది కంపెనీ. ఎలక్ట్రికల్ వాహనాలపైనా ఈ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది కంపెనీ.
ముడి సరుకుల ధరలు భారీగా పెరగటం.. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఛార్జీలు భారీగా పెరగటం కారణంగానే వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని వివరించింది కంపెనీ. పెరుగుతున్న ధరలతో పోల్చితే పెంచుతున్న ధరలు కొద్దిగానే ఉన్నాయని.. చాలా వరకు సర్ధుబాటు చేస్తున్నట్లు వెల్లడించింది కంపెనీ.
టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2026, ఏప్రిల్ ఒకటో తేదీన అన్ని వాహనాలపై పాయింట్ 5 శాతం ధరలు పెంచింది. జూలై ఒకటో తేదీన ఒకటిన్నర శాతం పెంచుతుంది. అంటే ఆరు నెలల్లో 2 శాతం ధరలు పెరిగాయి. ఇండియాలో కమర్షియల్, ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో టాటా మోటార్స్ రెండో స్థానంలో ఉంది.
జూన్ ఒకటో తేదీన మారుతీ సుజికీ కార్లపై 30 వేల రూపాయలు పెంచింది. దీనికి కొనసాగింపుగా అన్నట్లు.. టాటా మోటార్స్ జూలై ఒకటి నుంచి ఒకటిన్నర శాతం ధరలను పెంచుతుంది. టాటా మోటార్స్ లో వెహికల్ కొనాలనే ప్లాన్ ఉన్నోళ్లు.. ఈ 20 రోజుల్లోనే కొనేయండి.. లేకపోతే జూలై ఒకటి నుంచి కనీసంలో కనీసం 15 నుంచి 20 వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
