పవన్ కల్యాణ్‌‌ కు చంద్రబాబు పరామర్శ

పవన్ కల్యాణ్‌‌ కు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్‌‌కు​సర్జరీ జరుగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌‌లోని ఆయన నివాసంలో పవన్ కల్యాణ్‌‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య  పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌‌లో వారి నివాసానికి వెళ్లి జీఎన్‌‌ నాయుడుకు నివాళులర్పించారు. రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.