ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్దతు

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్దతు

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పష్టం చేసింది. ఆగస్టు 1న, ప్రతిపక్ష ఎంపీల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ప్రవేశపెట్టింది. కాగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో 01 సీటును కలిగి ఉంది.

ఆగస్టు 1న ఢిల్లీ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తరఫున సహాయ మంత్రి రాయ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు తీర్పు కేంద్రానికి వ్యతిరేకంగా రావడంతో ఆగమేఘాలపైఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చారు.ఆర్డినెన్స్ గడువు ముగియనుండటంతో కేంద్రం ప్రస్తుతం బిల్లును ప్రవేశపెట్టింది.

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును "అత్యంత అప్రజాస్వామిక" చట్టంగా పేర్కొంటూ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) I.N.D.I.A బ్లాక్ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తాయని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అధికార BJPకి చెందిన అనేక మంది MPలు కూడా దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆగస్టు 1న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బిజెడి) కూడా రాజ్యసభలో బిల్లు ఆమోదానికి మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా, ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని ఒడిశాకు చెందిన పార్టీ కూడా నిర్ణయించింది.

ఇక ఈ బిల్లు లోక్‌సభలో సులభంగానే ఆమోదం పొందనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సభలో ఎన్డీయేకు 330 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలోనూ బిజూ జనతాదళ్‌, వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో గట్టెక్కే అవకాశాలున్నాయి. అయితే ఎన్డీఏ కూటమితో సయోధ్య కోరుకుంటున్న టీడీపీ కూడా ఢిల్లీ బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.