ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రోడ్ షోలు, బహిరంగసభలతో జగన్ ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయభేరి పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పటిదాకా విడివిడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే, ఇకపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.ఏప్రిల్ 10,11న ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాగళం మూడో విడతలో బాబు, పవన్ ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు.ఏప్రిల్ 10వ తేదీ తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో, 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.