
విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. జనవరి 13వ తేదీ తాడేపల్లి సీఐడీ ఆఫీస్ కు వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులను కలిసి.. ఇసుక పాలసీ కేసులో మందస్తు బెయిల్ ష్యూరిటీని సమర్పించారు. ఇటీవల ఇసుక పాలసీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం పాలసీ మూడు కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం చంద్రబాబు ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లి పూచికత్తు ఇచ్చారు. చంద్రబాబు రాకతో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూ ఆయన తిరిగి వెళ్లిపోయారు.